బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడవ టెస్టుకు సిద్ధం అవుతున్న షమీ..! 12 d ago
మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్నాడు. బెంగళూరు వేదికగా చండీగఢ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ 1లో షమీ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించి బెంగాల్‌ను క్వార్టర్స్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్‌లో 17 బంతుల్లోనే 3 బౌండరీలు, 2 సిక్సర్లు బాది 32 పరుగులు చేసిన షమీ, 4 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్ 159/9 పరుగులు చేయగా, చండీగఢ్ 156 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.